ఆంధ్ర ప్రదేశ్
Eluru: పిల్లి పిల్లకు పాలిచ్చి.. తల్లి ప్రేమను పంచిన కుక్క

Eluru: ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల వసంత నగర్ లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. సహజంగా కుక్కకు పిల్లికి మధ్య జాతి వైరం నేపథ్యంలో కుక్కను చూస్తే ఎక్కడ దాడి చేస్తుందో అనే భయంతో పిల్లి పారిపోతుంది.. కానీ ఆ జాతి వైరాన్ని పక్కనపెట్టి ఓ పిల్లి పిల్ల కుక్కతో స్నేహం చేస్తుంది.. కుక్క కూడా దానినీ కంటికి రెప్పలా కాపాడుతూ పిల్లి పిల్ల బాగోగులు చూసుకుంటుంది.
ఈ క్రమంలోనే ఆ పిల్లి పిల్ల కుక్కను తల్లిలా భావించి దాని పాలు తాగేందుకు ప్రయత్నిస్తుంది. అయితే దాని ప్రయత్నాన్ని సైతం కుక్క అడ్డుకోకుండా పిల్లి పిల్లను తన ఒంటిపై ఎక్కించుకొని జాగ్రత్తగా చూసుకుంటుంది. కుక్క పిల్లి మధ్య ఆప్యాయత చూసిన వసంత నగర్ స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.