తెలంగాణ
Adilabad: ఇచ్చోడ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని అనుమానాస్పద మృతి

Adilabad: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని లాలిత్య అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. విద్యార్థిని మృతిచెందినట్లు ఆమె కుటుంబానికి తెలిపారు పాఠశాల యాజమాన్యం. అయితే లాలిత్య ఎలా ప్రాణాలు కోల్పోయిందో స్పష్టత లేదు.
ఘటనా స్థలానికి చేరుకున్న లాలిత్య కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బోథ్ ఆసుపత్రికి తరలించారు పాఠశాల సిబ్బంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.