తెలంగాణ
Telangana Cabinet: కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ భేటీ

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. కొత్త మంత్రుల బాధ్యతల స్వీకరణ తర్వాత తొలి సమావేశం జరుగుతోంది. మంత్రివర్గ సమావేశంలో భాగంగా పరిపాలనాపరమైన అంశాలు.. నిర్ణయాలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బనకచర్ల ప్రాజెక్టుపై చర్చిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ లేఖపై కూడా మంత్రివర్గం చర్చిస్తోంది.