ఆంధ్ర ప్రదేశ్
YS Jagan: రాజకీయాలను చంద్రబాబు మరింత దిగజార్చారు

YS Jagan: ఏపీలో కూటమి పాలనా తీరుపై.. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు రాజకీయాలను మరింత దిగజార్చారంటూ మండిపడ్డారు. తన పర్య టనకు ఎందుకు ఆంక్షలు పెట్టారో చెప్పాలంటూ క్వశ్చన్ చేశారు. తమ పాలనలో మీపై ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఎక్స్ వేదికగా నిల దీశారు.
తమ పార్టీ కార్యకర్తల ఇంటికి కూడా వెళ్లడం తప్పా అంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జగన్. ఇక మాజీ సీఎం ప్రయాణించే వాహనం భద్రత ప్రభుత్వానికి కాదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు మారాలన్నారు జగన్.