సినిమా

పూరీ-విజయ్ సేతుపతి సినిమా షూటింగ్ పూర్తి!

Puri-Vijay: దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న చిత్రం షూటింగ్ పూర్తయింది. బిచ్చగాళ్ల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పూరీ మార్క్ స్పీడ్‌ను మరోసారి చాటింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటన రానుంది.

పూరీ జగన్నాథ్ – విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ అధికారికంగా పూర్తయింది. ఇందులో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తోంది. బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరీకి చాలకాలంగా సాలిడ్ హిట్ లేకపోవడంతో ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

షూటింగ్ ముగిసిన సందర్భంగా విడుదల చేసిన వీడియోలో విజయ్ సేతుపతి షూటింగ్‌ను ఎంతో మిస్ అవుతున్నానంటూ మాట్లాడాడు. చార్మీ కౌర్, జేబీ పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button