తెలంగాణ
MLC Kavitha: మహిళా కలెక్టర్ కు పొంగులేటి క్షమాపణలు చెప్పాలి

MLC Kavitha: మంత్రి పొంగులేటి తీరుపై ఎమ్మెల్సీ కవిత నిప్పులు చెరిగారు. కరీంనగర్ కలెక్టర్‌ను అవమానించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇది కాంగ్రెస్ నేతల అహంకారానికి పరాకాష్ట ఈ ఉదంతమని ట్వీట్లో పేర్కొన్నారు. ఇలాంటి సిగ్గుమాలిన వైఖరి ఆమోదయోగ్యం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అయితే మంత్రి పొంగులేటి కేవలం కలెక్టర్‌ను అవమానించడమే కాదు.. మొత్తం అధికార యంత్రాంగాన్నే అవమానించినట్లు అని వెల్లడించారు. మహిళా కలెక్టర్ కు తాము అండగా ఉన్నామన్నారు కవిత. ఇక కలెక్టర్‌కు పొంగులేటి వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.