తెలంగాణ
ఈ నెల 18న మేడారంలో రేవంత్ కేబినెట్ మీటింగ్!

ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. సంప్రదాయానికి భిన్నంగా కేబినెట్ సమావేశం ఈసారి మేడారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 18న ఉదయం ఖమ్మం నగరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభ. నిర్వహించి మధ్యాహ్నం మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
మేడారంలోనే సీఎం రేవంత్ బస చేసి 19న ఉదయం అమ్మవార్ల నూతన ప్రాంగణాల ప్రారంబిస్తారని సమాచారం. తొలి దర్శనం అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరి . సాయంత్రం దావోస్‌కు వెళ్లనున్నారు. సీఎం రేవంత్ షెడ్యూల్, కేబినెట్ మేడారంలో నిర్వహించడంపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది.



