సినిమా

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో: నవ్వుల మహోత్సవం!

The Great Pre-Wedding Show: తిరువీర్ నటించిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమా ఆకట్టుకుంది. సింపుల్ కథతో కడుపుబ్బా నవ్వించింది. ఇంకా ఈ సినిమా ఎలా ఉందో పూర్తి వివరాలు చూద్దాం.

దర్శకుడు శ్రీనివాస్ చాలా బాగా సినిమాని ముందుకు నడిపించాడు. కథను రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా తెరమీదకు తెచ్చారు. సింపుల్ కథ అయినా పెద్దగా నస లేకుండా సాగింది. కాసేపు కడుపుబ్బ నవ్వించి, మనసారా ఆనందింపజేసి బయటకు పంపుతుంది. హీరో తిరువీర్ సహజంగా కనిపించాడు. హీరోయిన్ టీనా శ్రావ్య పక్కింటి అమ్మాయిలా ఆకట్టుకుంది.

ఫస్ట్ హాఫ్‌లో ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ అంతా ఫన్, ఎమోషనల్ జర్నీగా సాగింది. ముగింపు బాగుంది. కథ ఒకే చోట తిరిగినా బోర్ కొట్టలేదు. స్లోగా నడిచినా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తుంది. లొకేషన్లు రియల్‌గా ఉన్నాయి. పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం బాగుంది. వీకెండ్‌లో థియేటర్‌కు వెళ్తే కచ్చితంగా టైం పాస్ అవుతుంది. మొత్తంమీద ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button