లైఫ్ స్టైల్

Jowar Roti Benefits: జొన్నరొట్టె తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..

Jowar Roti Benefits: జొన్నల్లో ఐరన్‌, కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం వంటి మన ఆరోగ్యానికి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జొన్న రొట్టెలకు ఉన్న పోషకాలతో పాటు మన ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం..

*జొన్న రొట్టెలు తినటం వల్ల బరువు పెరగకుండా ఉంటారని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. జొన్నల్లోని ఫైబర్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జొన్న రొట్టెలు తినడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. చక్కెర స్థాయిలను నియంత్రించడంలో జొన్న రొట్టెలు సాయం చేస్తాయి.

*జొన్న రొట్టెలు తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

*జొన్నలలో విటమిన్ బి3, బి1,​ బి2, ఖనిజాలు, ఫైబర్, ప్రొటీన్లు​ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇందులోని ఫైబర్​ కండరాలను బలంగా ఉంచుతుంది.

*రోజూ జొన్న రొట్టెలు తినడం వల్ల ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి.

*జొన్న రొట్టెలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో, చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి.

*జొన్న రొట్టెలలో ఉండే ఫైబర్​ జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది.

*రెండు జొన్నరొట్టెలు తింటే చాలు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button