తెలంగాణ
MLC Kavitha: కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు సర్వం సిద్ధం

MLC Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహారదీక్షకు సర్వం సిద్ధమైంది. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో కవిత 72 గంటల నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో పూజలు నిర్వహించి ఆమె అత్తామామ వద్ద ఆశీర్వాదం తీసుకుని ధర్నా చౌక్‌కి బయలుదేరారు.



