తెలంగాణ
MLC Kavitha: బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. కవిత బహిష్కరణ

MLC Kavitha: బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక వాయిస్ వినిపిస్తున్నారు కవిత. గతంలో కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం విషయంలోనూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. ఫాంహౌస్‌లో కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. కాసేపట్లో కవిత సస్పెన్షన్‌పై నోట్ విడుదల కానుంది.



