సినిమా

దుల్కర్ సల్మాన్ కార్ల వివాదం!

Dulquer Salmaan: మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కార్ల సీజ్ వివాదం సంచలనం సృష్టిస్తోంది. కస్టమ్స్ అధికారులు ఫోర్జరీ డాక్యుమెంట్లపై సోదాలు నిర్వహిస్తున్నారు. దుల్కర్‌తో పాటు పృథ్వీరాజ్ ఇళ్లలో దాడులు జరిగాయి. అక్రమ కార్ల దిగుమతిపై విచారణ తీవ్రమైంది. పూర్తి వివరాలు చూద్దాం.

కేరళలో అక్రమ కార్ల దిగుమతి ఆరోపణల నేపథ్యంలో కస్టమ్స్ అధికారులు 30 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. దుల్కర్ సల్మాన్‌కు చెందిన ల్యాండ్ రోవర్ డిఫెండర్, టయోటా ల్యాండ్ క్రూజర్ కార్లను సీజ్ చేశారు. ఈ కార్లు దుల్కర్ పేరుపై లేకపోవడం, థర్డ్ ఓనర్‌గా ఉండటం ఆశ్చర్యం కలిగించింది. భూటాన్ నుంచి అక్రమ మార్గాల్లో దిగుమతి చేసినట్లు అనుమానం ఉంది.

అసలు ఓనర్ ఎవరన్నది విచారణలో ఉంది. మరో రెండు వాహనాల డాక్యుమెంట్లపై కూడా ఎంక్వైరీ జరుగుతోంది. దుల్కర్‌కు సమన్లు జారీ చేసే యోచనలో అధికారులు ఉన్నారు. అమిత్ చక్కలకల్ ఇంట్లో ఏడు వాహనాలు సీజ్ అయ్యాయి. కేరళలో దాదాపు 200 వాహనాలు అక్రమంగా దిగుమతి అయినట్లు అంచనా. హిమాచల్‌లో రిజిస్టర్ చేసి ఇతర రాష్ట్రాలకు రవాణా చేసినట్లు తెలుస్తోంది. లగ్జరీ కార్ షోరూమ్‌లకు నోటీసులు జారీ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button