Jaat: గ్రాండ్ గా జాట్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే.?

Jaat: బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ గద్దర్ -2 తో తన సెకండ్ ఇన్నింగ్స్ ను చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేసాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గద్దర్ -2 ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 700 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేసేందుకు టాలీవుడ్ దర్శకుడు గోపించంద్ మలినేనికి అవకాశం ఇచ్చాడు. అతని దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ బాలీవుడ్ హీరో.
గోపీచంద్ మలినేని సన్నీ డియోల్ హీరోగా ‘JAAT’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూట్ ను స్పీడ్ గా ఫినిష్ చేస్తున్నాడు గోపీచంద్ మలినేని. సన్నీ డియోల్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ గ్లిమ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు మేకర్స్.
ఈ నెల 22న జైపూర్ లోని విద్యాధర్ నగర్ స్టేడియంలో లో సాయంత్రం 5 గంటలకు జాట్ ట్రైలర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు. ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.