సినిమా

Sambarala Yetigattu: సాయి తేజ్ కెరీర్లో బెస్ట్ గ్లింప్స్!

Sambarala Yetigattu: సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న ‘సంబరాల ఏటి గట్టు’ గ్లింప్స్ విడుదలైంది. రోహిత్ కేపి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భారీ అంచనాలు సృష్టిస్తోంది. సాయి తేజ్ ఉగ్రరూపం ఆకట్టుకుంటోంది. ఈ గ్లింప్స్ హైలైట్స్ ఏమిటో చూద్దాం.

‘సంబరాల ఏటి గట్టు’ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ సాయి దుర్గ తేజ్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. రోహిత్ కేపి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి తేజ్ బీస్ట్ మోడ్‌లో కనిపిస్తున్నారు. గ్లింప్స్‌లోని యాక్షన్ సీన్స్, విజువల్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. అజనీష్ లోకనాథ్ సంగీతం గ్లింప్స్‌కు మరింత బలం చేకూర్చింది.

ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. సాయి తేజ్ డైనమిక్ పెర్ఫార్మెన్స్, దర్శకుడి విజన్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిలపనున్నాయి. గ్లింప్స్‌తో అంచనాలు రెట్టింపు కాగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button