సినిమా
ఆకట్టుకొని సల్మాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’!

Battle Of Galwan: సల్మాన్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘ది బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ టీజర్ మిశ్రమ స్పందన పొందింది. అభిమానులు ఉత్సాహం చూపినా, సాధారణ ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆకర్షణ లేదు. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.
సల్మాన్ ఖాన్ నటించిన ‘ది బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ టీజర్ ఆయన పుట్టినరోజున రిలీజ్ అయింది. నిజ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్‌లో సల్మాన్ తీవ్రమైన లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహం వ్యక్తం చేశారు.
అయితే సాధారణ ప్రేక్షకుల నుంచి మిశ్రమ రెస్పాన్స్ వచ్చింది. హై ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగ్గట్టు టీజర్ ఇంపాక్ట్ చూపలేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. పరిమిత ఫుటేజ్ వల్ల ప్రేక్షకులు డివైడ్ అయ్యారు. ఈ చిత్రం పట్ల భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో టీజర్ స్పందన మాత్రం షాకిస్తుంది.



