సినిమా

Google Search 2025: 2025 గూగుల్ ట్రెండ్స్‌లో టాలీవుడ్ హీరోల ఆధిపత్యం!

Google Search: 2025 సంవత్సరం గూగుల్ సెర్చ్ ట్రెండ్స్‌లో టాలీవుడ్ హీరోలు ఆధిపత్యం చెలాయించారు. అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచారు. ప్రభాస్ రెండో స్థానంలో ఉన్నారు. మిగతా టాప్ హీరోలు కూడా ముందు వరుసలోనే ఉన్నారు.

2025లో గూగుల్ సెర్చ్ ట్రెండ్స్‌లో టాలీవుడ్ హీరోలు బాక్సాఫీస్‌తోపాటు డిజిటల్ ప్రపంచంలోనూ హవా చాటారు. మొదటి స్థానంలో అల్లు అర్జున్ నిలిచారు. ‘పుష్ప 2: ది రూల్’ 1700 కోట్లకుపైగా వసూళ్లు సాధించడం, అట్లీ-త్రివిక్రమ్ ప్రాజెక్టుల హైప్ కారణంగా బన్నీ ఏడాది పొడవునా ట్రెండింగ్‌లో ఉన్నారు. రెండో స్థానంలో ప్రభాస్ ఉన్నారు.

‘కల్కి 2’, ‘స్పిరిట్’, ‘రాజాసాబ్’ అప్‌డేట్స్ ఆయన్ను నిరంతరం వార్తల్లో ఉంచాయి. ‘వారణాసి’ హైప్ తో మూడో స్థానంలో మహేష్ బాబు, నాలుగో స్థానంలో పవన్ కళ్యాణ్, ఐదో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. మొత్తంమీద టాలీవుడ్ హీరోలు సెర్చ్ ఇంజిన్లలో తమ ప్రజాదరణను మరోసారి నిరూపించుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button