Nithin: వెంకటేష్ ని ఫాలో అవుతున్న నితిన్

Nithin: టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ 60 ఏళ్ల వయసులో కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొని అలరించారు. ప్రమోషన్స్ అనేవి సినిమా సక్సెస్ పై ఎలాంటి ఇంపాక్ట్ చూపుతాయో తెలియచేశారు. కేవలం ప్రమోషన్స్ వల్లే సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ నుంచి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పొచ్చు.
ఇప్పుడు వెంకటేష్ ను నితిన్ కూడా ఫాలో అవుతున్నాడు. నితిన్ తన తాజా చిత్రం రాబిన్‌హుడ్ ప్రమోషన్స్ కోసం తెగ కష్టపడుతున్నాడు. ఎప్పుడూ లేని కాలేజ్ టూర్లు, మాల్స్ కు వెళ్లడం, వివిధ ఈవెంట్స్ కు వెళ్లడం, ఆఖరికి స్టేజ్ పై డ్యాన్సులు కూడా చేస్తున్నాడు. వెంకటేష్ లానే చిత్ర యూనిట్ తో కలిసి నితిన్ ఫన్నీ ఇంటర్వ్యూలు, పాడ్ కాస్ట్‌లు చేస్తూ ప్రమోషన్స్ ద్వారా కూడా మంచి ఫన్ అందిస్తున్నాడు.
మరి వెంకీ దారిలో వెళ్తున్న నితిన్ కు, ఆయన లానే ఆ స్థాయి సక్సెస్ దక్కుతుందా లేదా అనేది తెలియాలంటే రాబిన్ హుడ్ రిలీజ్ వరకు ఆగాల్సిందే. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన రాబిన్ హుడ్ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. మార్చి 27న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొస్తుంది.