సినిమా
Vallabhaneni Anil: సినీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది

Vallabhaneni Anil: సినీ కార్మికుల సమ్మె కొనసాగుతుందని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ తెలిపారు. వేతనాల పెంపు కోసం 9వ రోజుల పాటు చిత్రీకరణలు నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. రేపు మరోసారి ఫిల్మ్ ఛాంబర్‌తో సమావేశం అవుతామన్నారు.
అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని అనిల్ తెలిపారు. చిన్న నిర్మాతల గురించి , వర్కింగ్ కండీషన్స్‌పై కూడా రేపు మాట్లాడతామన్నారు. రేపటి చర్చల అనంతరం సమ్మెపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ తెలిపారు.



