సినిమా

Mad Square: మ్యాడ్ స్క్వేర్ బాక్సాఫీస్ రచ్చ.. సక్సెస్ మీట్‌కు జూ. ఎన్టీఆర్

Mad Square: టాలీవుడ్‌లో సందడి చేస్తున్న క్రేజీ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్ వద్ద జోరుగా దూసుకెళ్తోంది. కథతో సంబంధం లేకుండా కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఈ చిత్రం సాలిడ్ రన్ సాధిస్తోంది. దీంతో భారీ వసూళ్లు రాబడుతూ అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్‌కు చేరుకుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఏప్రిల్ 4న సక్సెస్ మీట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

ఈ ఈవెంట్‌కు ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూ. ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతున్నట్లు సమాచారం. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లోనూ ఈ సక్సెస్ మీట్‌పై హైప్ ఏర్పడింది. ‘మ్యాడ్ స్క్వేర్’లో నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ కీలక పాత్రల్లో మెప్పించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర హారిక, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. కామెడీతో కడుపుబ్బా నవ్వించే ఈ మూవీ ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. సక్సెస్ మీట్‌లో జూ. ఎన్టీఆర్ రాకతో ఈ వేడుక మరింత హైలెట్ కానుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button