సినిమా

The Raja Saab: రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ ఆలస్యం!

The Raja Saab: ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ విడుదలపై రూమర్స్‌కు టీమ్ స్పందించింది. మార్కెటింగ్ టీమ్స్ చర్చల వల్ల ఆలస్యమవుతుందని ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ నవంబర్‌లోనే రిలీజ్ అవుతుందని తెలిపారు.

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ సినిమాపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హారర్-కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ విడుదలపై చర్చ జరుగుతోంది. రూమర్స్‌కు అంతం పలికిన ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్, బాలీవుడ్, టాలీవుడ్ మార్కెటింగ్ టీమ్స్ మధ్య చర్చలే ఆలస్యానికి కారణమని వెల్లడించారు. మొదట రెబెల్ సాబ్ సాంగ్ రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ నార్త్ పంపిణీదారులు మెలోడి సాంగ్ ముందు రిలీజ్ చేయాలని సూచించారు. సౌత్ లో లిరికల్ వీడియోలు మాత్రమే రిలీజ్ చేస్తారు.

ఉత్తరంలో పూర్తి వీడియోలు ముందుగా విడుదల అవుతాయి. ఈ వ్యత్యాసం కూడా ఆలస్యానికి దోహదం చేసింది. సినిమాలో ఐటెం సాంగ్ లేదు. పాపులర్ హిందీ సాంగ్ రీమిక్స్ ఒకటి ఉంది. ప్రతి సాంగ్ మధ్య 10-14 రోజుల గ్యాప్ ఇస్తారు. అభిమానులు మ్యూజిక్ ఆస్వాదించేలా ఈ వ్యూహం అమలు చేస్తారు. ఇక ఫస్ట్ సింగిల్ నవంబర్ మూడవ లేదా నాల్గవ వారంలో రిలీజ్ అవుతుందని తెలిపారు. జనవరి 9, 2026 పొంగల్‌కు ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button