తెలంగాణ

Kishan Reddy: రాముడు, శివుడిని రాజకీయాల్లోకి లాగొద్దు

రాముడు, శివుడిపై రేవంత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైరయ్యారు. దేవుళ్లను సైతం రాజకీయాల్లోకి లాగడం సరికాదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రాముడు ధనికుల దేవుడు, శివుడు పేదల దేవుడు అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజంలో విభేదాలు సృష్టించేలా ఉన్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పక్కనపెట్టి కొత్త వివాదాలను తెరపైకి తెస్తోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇతర మతాల దేవుళ్లపై ఇదే విధంగా మాట్లాడే ధైర్యం సీఎం రేవంత్ రెడ్డికి ఉందా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button