ఆంధ్ర ప్రదేశ్
నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!

ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. కేబినెట్ భేటీలో రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించే అవకాశం ఉంది. సీఆర్డీయే ప్రతిపాదనలతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మోతడకలో 2 వేల 340 ఎకరాల ల్యాండ్ పూలింగ్‌కు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
అమరావతిలో 20 ప్రాంతాల్లో 5జీ సెల్ టవర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచే ప్రతిపాదనలతో పాటు.. పలు సంస్థలకు భూకేటాయింపులపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అలాగే ఈ నెల మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ అంశంపైనా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి.



