జాతియం
వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా పనిచేయాలని మోడీ సూచన

దేశ అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక దిశానిర్దేశం చేశారు. వికసిత్ భారత్ 2047 విజన్‌ను సాధించేందుకు ప్రతి శాఖ వేగంగా పనిచేయాలని మంత్రులకు సూచించారు. ముఖ్యంగా సంస్కరణల అమలు మరింత వేగవంతం చేయాలని, ప్రజలకు ప్రభుత్వ సేవలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇక దేశ ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి, కేంద్ర పథకాల అమలుపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ప్రపంచ ఆర్థిక సవాళ్ల మధ్య భారత్ వృద్ధిరేటును నిలబెట్టేందుకు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. అభివృద్ధి, పారదర్శకత, సమర్థ పాలనతో ప్రజల్లో విశ్వాసం పెంచేలా ముందుకు సాగాలని మంత్రులకు ప్రధాని మోడీ సూచించారు.



