తెలంగాణ
కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీస్

కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీస్ పంపించారు. అంగన్‌వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలుపై బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. బీఆర్ఎస్ ఆరోపణలపై కేసీఆర్‌కు నోటీసులు పంపారు సీతక్క. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి కేసీఆర్‌దే బాధ్యత అన్నారు. తన ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని.. 48 గంటల్లో పోస్టులు తొలగించి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో మంత్రి సీతక్క పేర్కొన్నారు. లేదంటే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు.



