ఆంధ్ర ప్రదేశ్
అయ్యన్నపాత్రుడుని మర్యాదపూర్వకంగా కలిసిన పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ని స్పీకర్ చాంబర్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తన శాఖ పరిధిలోని నర్సీపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి కి సంబంధించిన సమగ్ర నివేదికను స్పీకర్ కి ఆయన అందజేశారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఆధ్వర్యంలో నర్సీపట్నంలో మొత్తం రూ. 312 కోట్ల నిధులతో 5,628 పనులు మంజూరు కాగా, ఇప్పటికే రికార్డు స్థాయిలో 4,530 పనులు పూర్తయినట్లు పవన్ కళ్యాణ్ ఈ నివేదికలో స్పష్టం చేశారు.



