తెలంగాణ
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరిగే ఈ ఎన్నికల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.
ఉప సర్పంచి ఎన్నిక కూడా అదే రోజు పూర్తవుతుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని ఎన్నికల షెడ్యూల్‌తో పాటు మొత్తం నిర్వహణ ప్రక్రియను వివరించారు. ఈ సందర్భంగా ఎన్నికలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను కూడా విడుదల చేశారు.



