సినిమా

Akhanda 2: అఖండ-2 ‘తాండవం’ పాటకి సోషల్ మీడియా షేకింగ్!

Akhanda 2: బోయపాటి-బాలకృష్ణ మూడో కాంబినేషన్ ‘అఖండ-2’ నుంచి ‘తాండవం’ పాట విడుదలై సంచలనం సృష్టిస్తోంది. థమన్ సంగీతం, బాలయ్య అఘోరా లుక్ అదిరిపోయాయి. మాస్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను మూడో సినిమా ‘అఖండ-2’ నుంచి విడుదలైన ‘తాండవం’ పాట నెట్టింట రచ్చ రేపుతోంది. థమన్ సంగీతం, శంకర్ మహాదేవన్, కైలాశ్ ఖేర్, దీపక్ గాత్రాలు, కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్‌తో ఈ పాట అద్భుతంగా తయారైంది. ముఖ్యంగా బాలకృష్ణ అఘోరా రూపంలో తాండవ నృత్యం చేస్తూ కనిపించిన విజువల్స్ మాస్ ప్రేక్షకులకు పూనకలు తెప్పిస్తున్నాయి.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుంది. సినిమా కథలో అఘోరా పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. బాలయ్య-బోయపాటి కాంబో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతోందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button