జాతియం
Bihar Election Result: బీహార్ ఎన్నికల ఫలితాలు.. ప్రత్యక్ష ప్రసారం

Bihar Election Result: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 38 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 46 లెక్కింపు కేంద్రాల్లో ప్రక్రియ జరుగుతోంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అధికారులు, అనంతరం ఈవీఎంల ఓట్ల లెక్కింపును ప్రారంభించనున్నారు. మూడు దశల్లో జరిగిన పోలింగ్లో మొత్తం 57 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల శాఖ వెల్లడించింది. లెక్కింపు ప్రారంభమైన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది.



