ఉస్తాద్ నుంచి ఎనర్జిటిక్ అప్డేట్!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ టీం అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. స్టైలిష్ పోస్టర్‌తో హైప్ పెంచిన ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌తో హోరెత్తనుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ మాస్ ఎంటర్టైనర్ అదిరిపోనుంది. పూర్తి వివరాలు చూద్దాం.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కొత్త షెడ్యూల్ ఈ శనివారం నుంచి ప్రారంభం కానుంది. పవన్ కళ్యాణ్‌పై ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్ చిత్రీకరణతో ఈ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని సమాచారం. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీతో ఈ పాట మాస్ అప్పీల్‌ను సొంతం చేసుకోనుంది. హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో నింపుతున్నారు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తోంది. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్-హరీష్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.



