సూపర్‌మ్యాన్: ఓటిటిలో ట్విస్ట్!

Superman: డీసీ కామిక్స్ సూపర్‌మ్యాన్ కొత్త ఎడిషన్‌తో థియేటర్లను కదిలించాడు. ఇప్పుడు ఈ సినిమా ఓటిటిలోకి రాబోతోంది. అయితే, ఈ విడుదలలో ఓ ట్విస్ట్ ఉందట. అభిమానులను ఆశ్చర్యపరిచే ఈ అప్డేట్ ఏంటి? ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది? వివరాలు తెలుసుకుందాం.‘సూపర్‌మ్యాన్’ సినిమా జూలై 11న థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఆగస్ట్ 15 నుంచి ఓటిటిలోకి వస్తోంది. ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, ఫండగో వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుంది.
అయితే, ఇది సబ్‌స్క్రిప్షన్‌లో కాకుండా రెంటల్‌గా మాత్రమే లభిస్తుంది. అదనపు చెల్లింపుతో సినిమాను చూడాల్సి ఉంటుంది. డేవిడ్ కోరిన్స్వెట్ సూపర్‌మ్యాన్‌గా, నికోలస్ హౌల్ట్ విలన్‌గా నటించిన ఈ చిత్రానికి జేమ్స్ గన్ దర్శకత్వం వహించారు. యాక్షన్, ఎమోషన్‌లతో కూడిన ఈ కొత్త ఎడిషన్ అభిమానులను ఆకట్టుకుంటోందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.



