తెలంగాణ
నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో డీజిల్ దొంగల హల్చల్

నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో డీజిల్ దొంగల హల్చల్ చేశారు. ఓ లారీ నుంచి డీజిల్ చోరీ చేస్తుండగా పోలీసులకు స్థానికుల సమాచారం ఇచ్చారు. పోలీసులను చూసి దొంగలు వాహనం వదిలి పారిపోయారు. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆగివున్న లారీలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు.



