తెలంగాణ
Balmuri Venkat: పైసల దందా చేసి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ అయ్యాడు

Balmuri Venkat: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైరయ్యారు. పైసల దందా చేసి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ అయ్యాడని ఆయన విమర్శించారు. డబ్బులు డిమాండ్ చేస్తే బాధితులు కేసు పెట్టారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం ఆయన ఏదో ఉద్యమం చేస్తే అరెస్ట్ చేశారని ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
కౌశిక్‌రెడ్డిది బ్లాక్మెయిల్ చరిత్ర అని ఆయన ధ్వజమెత్తారు. గతంలో సొంత పార్టీ నేతల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తే హరీష్, కేటీఆర్‌లు కౌశిక్‌రెడ్డిని మందలించారని ఆయన ఆరోపించారు. కౌశిక్‌రెడ్డి దుబాయ్‌కు పారిపోయే ప్రయత్నం చేస్తే పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు.