జాతియం
Air India: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్యలు

Air India: దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియాలో వరుస ఘటనలు ఆందోళనలు కల్గిస్తున్నాయి. తాజాగా మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం ప్రయాణికులను కలవరపాటుకి గురిచేసింది. ఏఐ 180 విమానం శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి కోల్‌కతా మీదుగా ముంబైకి వెళ్తోంది.
అర్ధరాత్రి 12గంటల 45నిమిషాలకు కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకుంది. ఈ క్రమంలో విమానంలోని ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీన్ని సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల రీత్యా ప్రయాణికులను విమానం నుంచి దించేశారు.