జాతియం
Air India: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం

Air India: ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ రకానికి చెందిన ఏఐ 315 విమానం హాంకాంగ్ నుంచి ఢిల్లీకి బయల్దేరింది. అయితే మార్గమధ్యలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీన్ని గుర్తించిన పైలట్ ఈ విషయాన్ని వెంటనే అధికారులకు దృష్టికి చేరవేశారు. అనంతరం విమానాన్ని తిరిగి వెనక్కి మళ్లించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.