NC 24 కోసం నాగచైతన్య సంచలన మేకోవర్!

Naga Chaitanya: నాగచైతన్య మరోసారి తన అద్భుతమైన మేకోవర్‌తో ఆకట్టుకోనున్నాడు. తండేల్ సక్సెస్‌తో మార్కెట్‌ను షేక్ చేసిన చైతూ, ఇప్పుడు కార్తీక్ దండు డైరెక్షన్‌లో NC24 మూవీ కోసం సిద్ధమవుతున్నాడు. మిథికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చైతూ సాహసికుడి పాత్రలో కనిపించనున్నాడు.
తండేల్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాగచైతన్య, ఇప్పుడు మరో బ్లాక్‌బస్టర్‌కు రెడీ అవుతున్నాడు. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో NC24 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మిథికల్ థ్రిల్లర్‌లో చైతూ సాహసికుడిగా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం చైతన్య మరోసారి తన లుక్‌ను పూర్తిగా మార్చుకుంటూ సంచలనం సృష్టించనున్నాడు.
ఫిట్‌నెస్‌పై ఎప్పటికీ శ్రద్ధ చూపే చైతూ, ఈ సినిమా కోసం కఠినమైన ట్రైనింగ్, స్ట్రిక్ట్ డైట్‌ను ఫాలో చేస్తున్నాడు. హైదరాబాద్‌లో ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందుతోంది. చైతూ కెరీర్‌లో 24వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం మరో సక్సెస్ స్టోరీని రాయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.