సినిమా

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ‘వీరమల్లు’ జూన్ 12న గ్రాండ్ రిలీజ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్! ‘హరి హర వీరమల్లు’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. వచ్చే జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా ఈ భారీ యాక్షన్ డ్రామా విడుదల కానుంది. ధర్మం కోసం సమరం చేసే వీరుడి కథతో ఈ సినిమా అభిమానులకు విజువల్ ట్రీట్ ఇవ్వనుంది.

పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. 17వ శతాబ్దం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం, ధర్మం కోసం పోరాడే ఓ వీరుడి కథను తెరపైకి తీసుకొస్తోంది. తాజాగా విడుదలైన పోస్టర్‌లో పవన్ కల్యాణ్ యుద్ధ వీరుడిగా, ఖడ్గంతో నిలబడిన లుక్ అదిరిపోయింది. యుద్ధ దృశ్యాలు, గుర్రాలు, ధ్వంసమైన కట్టడాలతో సినిమా భారీతనం స్పష్టమవుతోంది.

కృష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ సమర్పణలో వస్తున్న ఈ మూవీకి ఎం.ఎం. కీరవాణి సంగీతం, జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ, తోట తరణి ఆర్ట్ డైరెక్షన్ బలమైన అంశాలుగా మారాయి. ‘స్వోర్డ్ vs స్పిరిట్’ ట్యాగ్‌తో వస్తున్న ఈ సినిమా, జూన్ 12న అన్ని భాషల్లో విడుదల కానుంది. అభిమానులకు ఈ సినిమా ఓ యాక్షన్ ఫీస్ట్ కాబోతుందని టాక్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button