వ్యాపారం

Gold Price: దిగొచ్చిన బంగారం ధర.. తులం ఎంతంటే..

Gold Price: బంగారం ధర తగ్గుముఖం పట్టింది. నిన్నటితో చూస్తే నేడు కూడా బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఒకే రోజు పసిడి ధర 3వేలు ధర తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ​​96వేల 710 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 87వేల 650 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 1000 తగ్గింది.

బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులతోపాటు దేశీయంగా ఉన్న పరిస్థితులు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం పసిడి ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి నుంచి తగ్గుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం అంతర్జాతీయంగా బంగారం ధర ఒక ఔన్స్ 3230 డాలర్లుగా ఉంది. గతంలో ఇది 3500 డాలర్లుగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా తగ్గుతోంది. ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి ధరలు తగ్గుతున్నాయి. అయితే బంగారం ధరలు రిటైల్ మార్కెట్లో తగ్గడానికి కాస్త సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button