ఆంధ్ర ప్రదేశ్
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు

Vallabhaneni Vamsi: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టైన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్‌ను న్యాయస్థానం పొడిగించింది. ఇవాల్టితో రిమాండ్ ముగియనుండటంతో పోలీసులు ఆయన్ను విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, రిమాండును పొడిగిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. దీంతో వంశీని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.