సినిమా
Subham: శుభం బ్లాక్‌బస్టర్.. సమంత నిర్మాతగా సక్సెస్

Subham: టాలీవుడ్ స్టార్ సమంత నిర్మాతగా మారిన ‘శుభం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఫస్ట్ వీకెండ్‌లో అదిరే వసూళ్లు వచ్చాయి.
సమంత తొలిసారి నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ హారర్ కామెడీ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో హర్షిత్ రెడ్డి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి తదితరులు నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలిరోజు సామాన్యంగా ఉన్న కలెక్షన్స్ ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి వరల్డ్‌వైడ్‌గా రూ.5.25 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
హాస్యం, భయానక అనుభూతులతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. సమంత నిర్మాతగా తన సత్తా చాటారని అభిమానులు కొనియాడుతున్నారు. ‘శుభం’ పూర్తి రన్‌లో ఎంతమేర వసూళ్లు సాధిస్తుందని ఆసక్తి నెలకొంది.