తెలంగాణ
TGS RTC: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్

TGS RTC: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 14 నెలలు కావొస్తోందని ఇంతవరకు తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రికల్ బస్సులు తీసుకువచ్చి ప్రైవేటుకు పూర్తిగా దారాదత్తం చేస్తున్నారన్నారు.
ఈ నేపథ్యంలో సమ్మె చేయాలని ఆర్టీసీ సంఘాలు నిర్ణయించాయి. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు.