అంతర్జాతీయం

Plane Crash: సూడాన్‌లో కూలిన సైనిక విమానం.. 46 మంది మృతి

Plane Crash: సూడాన్‌ లో మంగళవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేకుంది. వాడి సయిద్నా వైమానిక స్థావరం నుంచి ఓ సైనిక విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే నివాసాల మధ్య కుప్పకూలింది. ఈ ఘటనలో 46మంది సైనిక సిబ్బందితో పాటు పలువురు పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పది మందికి పైగా గాయపడినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదని ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సూడాన్‌ పై పట్టు కోసం సైన్యం, పారామిలిటరీ రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ మధ్య కొనసాగుతున్న అంతర్యుద్ధం ఇటీవల తీవ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో న్యాలా ప్రాంతంలో ఇటీవల ఓ సైనిక విమానాన్ని కూల్చివేసినట్లు డార్ఫర్ పశ్చిమ ప్రాంతాన్ని నియంత్రిస్తున్న ఆర్‌ఎస్‌ఎఫ్‌ ప్రకటించింది. అయితే ప్రస్తుత ప్రమాదానికి ఈ ఘర్షణలకు సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button