Bengaluru: సన్రూఫ్ సరదా ప్రాణాల మీదకు తెచ్చింది

Bengaluru: ఓ బాలుడి సరదా అతని ప్రాణాల మీదకి తెచ్చింది. తండ్రి కారు నడుపుతుండగా కారు సన్రూఫ్ తెరిచి బాలుడు నిలబడ్డాడు. తక్కువ ఎత్తున్న ఓవర్ హెడ్ బీమ్ కింద నుంచి ఆ కారు వెళ్లింది. దీంతో ఆ బాలుడి తలకు ఆ ఇనుప స్తంభం తగిలింది.
ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. విద్యారణ్యపుర ప్రాంతంలోని జీకేవీకే రోడ్డులో ఎరుపు రంగు కారు దూసుకెళ్లింది. బాలుడు కారు సన్రూఫ్ వద్ద తల బయటకు ఉంచి నిల్చొని ఉన్నాడు. రోడ్డుపై ఉన్న ఇనుప కడ్డీ బాలుడు తలకు బలంగా తగిలింది.
ఈ ఘటనలో బాలుడుకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే బాలుడు తండ్రి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన బాలుడు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



