తెలంగాణ
ఆస్తి రాయించుకుని తల్లిని ఇంటి నుంచి గెంటేసిన కొడుకు

ఆస్తిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుని తల్లిని రోడ్డున పడేసిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. చందుర్తి మండలం రామారావు పల్లె గ్రామానికి చెందిన వృద్ధురాలు ఎల్లవ్వ అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా తల్లి పేరుపై ఉన్న ఇల్లు, భూములను కుమారుడు కిషన్ తన పేరుకు మార్చించుకొని తల్లిని ఇంటి నుంచి గెంటేశాడు.
ఇంటిని, భూములను కోల్పోయిన ఎల్లవ్వ ప్రస్తుతం సనుగుల గ్రామంలో తన కూతురు లక్ష్మీ వద్ద ఉంటుంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఎల్లవ్వను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చించి కూతురు లక్ష్మీ సైతం చేతులు దులుపుకుంది. దీంతో ఎల్లవ్వకు ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయి. తనను అనాథగా విడిచిపెట్టిన కుమారుడిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని ఎల్లవ్వ కోరుతోంది.



