సినిమా

చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‎కు ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతి!

మెగాస్టార్ చిరంజీవి నడిపిస్తున్న చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‎కు కేంద్ర హోం శాఖ ఎఫ్‌సీఆర్‌ఏ గుర్తింపు లభించింది. ఇకపై విదేశాల నుంచి విరాళాలు స్వీకరించే అవకాశం కలిగింది.

మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ గత ఇరవై ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్విహిస్తోంది. ముఖ్యంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ ద్వారా ఈ ట్రస్ట్ లక్షలాది మందికి సేవలు అందిస్తోంది. ఇప్పటివరకు దేశీయ విరాళాలతోనే ఈ కార్యక్రమాలు సాగుతున్నాయి.

ఇటీవల కేంద్ర హోం శాఖ ఎఫ్‌సీఆర్‌ఏ (ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్) అనుమతి మంజూరు చేసింది. దీంతో విదేశాల్లో ఉన్న తెలుగు ప్రవాసులు, ఇతర దాతల నుంచి నేరుగా విరాళాలు స్వీకరించే మార్గం సుగమమైంది. ఈ అనుమతితో చిరంజీవి ట్రస్ట్ సేవా కార్యక్రమాలు మరింత విస్తరించే అవకాశం ఉందని చిరంజీవి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button