ఆంధ్ర ప్రదేశ్
JC Prabhakar Reddy: దమ్ముంటే తాడిపత్రికి రా.. తేల్చుకుందాం.. కేతిరెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్

JC Prabhakar Reddy: కేతిరెడ్డి పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే తాడిపత్రికి రా.. తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానిచ్చేదే లేదన్నారు. కేతిరెడ్డి చేసిన దౌర్జన్యాలపై తాడిపత్రి ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. గతంలో టీడీపీ నేతలకు కూడా హైకోర్టు ఆదేశాలున్నా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రానివ్వలేదన్నారు. ఇప్పుడు ఎన్ని కోర్టుల ఆదేశాలు తెచ్చినా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి రావడానికి ఒప్పుకోమన్నారు.



