ఆంధ్ర ప్రదేశ్
ఏఆర్ కానిస్టేబుల్ చెన్నారెడ్డి సస్పెన్షన్

శ్రీవారి ఆలయ భద్రతా విధుల్లో ఈనెల 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకూ చెన్నారెడ్డికి గొల్లమండపం వద్ద డ్యూటీ ఉండగా తుపాకీ వదిలేసి భూమన కరుణాకర్ రెడ్డి వెంట ఆలయంలోకి వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. మూడు గంటల పాటు తుపాకీని వదిలిపెట్టేసి వెళ్ళిపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ఉన్నతాధికారులు చెన్నారెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. చెన్నారెడ్డి గతంలో భూమన కరుణాకర్ రెడ్డికి గన్మెన్గా పనిచేశారు.



