ఆంధ్ర ప్రదేశ్
Fire Accident: జిన్నింగ్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

Fire Accident: కర్నూలు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదోనిలోని ఎన్డీబీఎల్ కాటన్ జిన్నింగ్ అండ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది. అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. అగ్ని ప్రమాదం కారణంగా పరిశ్రమలోని పత్తి కాలపోయింది. సుమారు 10 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఫ్యాక్టరీ యజమాని బత్తినినాథ్ కుబేర్ తెలిపారు.



