జాతియం
Viral Video: అడవి పందిని వేటాడుతూ ఊహించని విధంగా బావిలో పడిపోయిన పులి.. వైరల్ వీడియో..

Viral Video: మధ్యప్రదేశ్ సియోని నగరం పెంచ్ నేషనల్ పార్క్ సమీపంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. అడవి పందిని వేటాడి దాని ప్రాణం తీసి తిందామనుకున్న పులికి, చివరకు తన ప్రాణాలను తాను కాపాడుకునే పరిస్థితి వచ్చింది. ఓ అడవి పందిని పులి వేటాడుతోంది. పులి వేటాడుతుంటే దాని నుంచి ప్రాణాలు కాపాడుకోవడం కోసం అనుకోకుండా బావిలో పడింది అడవి పంది. ఊహించని విధంగా పులికూడా బావిలో పడిపోయింది.
బావిలో పడ్డ ఆ రెండు జంతువులను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. పులి, అడవి పంది రెండు క్రూర జంతువులూ ఒకే చోట ఉండటంతో వాటిని సేవ్ చేయడం అధికారులకు సవాల్ గా మారింది. దాదాపు 60 మంది రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొని, నాలుగు గంటల తర్వాత ఒక మంచం, హైడ్రాలిక్ క్రేన్ సహాయంతో ఆ రెండు జంతువులను రక్షించారు.