Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’.. పవన్ సూచనలతో ఐటమ్ సాంగ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ నుంచి మూడో సింగిల్ ‘అసుర హననం’ సాంగ్ లాంచ్ చేయగా, ఆ పాట ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ప్రెస్ మీట్‌లో కీరవాణి ఐటమ్ సాంగ్ ఉంటుందని, ఆ పాట విశేషాలు పంచుకున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజాగా, మూడో సింగిల్ ‘అసుర హననం’ పాటను ఘనంగా విడుదల చేయగా, అది ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.
ఇక ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్‌లో సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ, చిత్రంలోని ‘తార సితార’ అనే ఐటెం సాంగ్‌లోని కొన్ని లైన్స్‌పై పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు. డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవన్, బాధ్యతాయుతంగా ఆ లైన్స్ మార్చి మళ్లీ రికార్డింగ్ చేయించారని చెప్పారు. ఈ సినిమా నుంచి తదుపరి పాట ‘తార సితార’ కావచ్చని అభిమానులు ఊహిస్తున్నారు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు.



