Thala Movie Review: 'తల' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

యాక్షన్ సిక్వెన్సెస్ ని ఇష్టపడే వాళ్ళకి కచ్చితంగా నచ్చే సినిమా..
Thala Movie Review: దీప ఆర్ట్స్ బ్యానర్ పై సుప్రసిద్ధ కొరియోగ్రాఫర్ మరియు దర్శకుడు అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో తన కొడుకు అమ్మ రాగిన్ రాజ్, అంకిత నస్కర్ ను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ తీసిన చిత్రం తల. ‘6 టీన్స్’ రోహిత్, ఎస్తేర్ నోరోన్హా, సత్యం రాజేష్, అజయ్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ తదితరులు కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకులు ముందుకు తీసుకుని వచ్చారు. ఈ చిత్రం యొక్క పూర్తి రివ్యూ మీకోసం…
కథ :
హీరో తల్లి తను ప్రేమించి పెళ్లాడిన వ్యక్తి దూరమై అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా హీరో తన తల్లి పడుతున్న ఆవేదన చూడలేక తన తండ్రి కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. అలా వచ్చిన తరువాత తన తండ్రిని ఎలా ఎక్కడ వెతికి పట్టుకున్నాడు? కుటుంబంలోకి ఎలా వెళ్తాడు? అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి సంఘటనలు జరిగాయి? తనకు పరిచయమైన అమ్మాయి హీరో చివరికి కలిసారా లేదా? అలా వెతికి పట్టుకున్న తన తండ్రి కుటుంబం లో ఉన్న సమస్య ఏమిటి? ఆ సమస్యను వారు ఎలా పరిష్కరించుకున్నారు? అసలు చివరికి తన తల్లిదండ్రులు కలుస్తారా? ఈ ప్రయాణంలో వారి జీవితాలు ఎటువంటి మలుపులు తిరుగుతాయి? అనే ప్రశ్నలకు సమాధానం ఈ చిత్రం చూడడం…
నటీనటుల నటన:
అమ్మ రాజశేఖర్ తనయుడు గా అమ్మ రాగిన్ రాజ్ నటించిన తొలి చిత్రం అయినా కూడా మంచి నటనను కనబరిచాడు. ప్రతి సీన్ లో ప్రతి ఎమోషన్, నటన లో పరిపక్వత ఎంతో స్పష్టంగా తనదైన శైలిలో తను నటిస్తూ మంచి నటుడు గా తొలి చిత్రంతోనే ప్రూవ్ చేసుకున్నాడు. హీరోయిన్ అంకిత అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. అదేవిధంగా చాలాకాలం తర్వాత తెరపైకి వచ్చిన రోహిత్ హీరో తండ్రి పాత్రలో తనదైన శైలిలో నటించి ఆ పాత్రకు ప్రాణం పోశారు. అదేవిధంగా ఎస్తేర్ నోరోన్హా తన పాత్ర పరిధి మేరకు నటించి ఎమోషన్ ని పండించారు. ఈ సినిమాలో నటించిన మిగతా వారు అజయ్, సత్యం రాజేష్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ వంటి వారు ఈ చిత్రానికి మరొక ప్లస్ పాయింట్ గా నిలిచారు. క్లైమాక్స్ లో ఇంద్రజ గారి క్యారెక్టర్, నటన బాగుంటాయి. సినిమాలో నటించిన ప్రతి పాత్రకి ఒక ఇంపార్టెన్స్ ఉంది.
సాంకేతిక విశ్లేషణ :
ఈ చిత్రానికి కథనం, కథా బలం చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. అమ్మాయి కోసం ప్రాణాలు ఇస్తున్న జనరేషన్లో అమ్మకోసం ఇంత కష్టపడే కొడుకు కథగా ఈ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ఈ కథను తెరపైకి తీసుకువెళ్లడంలో దర్శకుడిగా అమ్మ రాజశేఖర్ విజయం సాధించారు. ఈ కాలం కి తగినట్టుగా స్క్రీన్ ప్లే చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అలాగే చిత్రంలోని పాటలు, మ్యూజిక్ ఆకట్టుకుంటాయి. చిత్రంలోని యాక్షన్ సీన్స్ ఇంటెన్స్ గా ప్రేక్షకులు ను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. టెక్నికల్‌గా నిర్మాణపరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి విలువలతో అలాగే బిఎఫ్ ఎక్స్ కూడా అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు. డిఓపి గా శ్యామ్ కె నాయుడు విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఎడిటింగ్ వర్క్ ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్ గా నిలుస్తుంది. అమ్మ రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అనే విధంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ చిత్రం అంతా ఉత్తర ప్రదేశ్ లోని రియల్ లొకేషన్స్ లో నాచురల్ గా నిర్మించారు
ప్లస్ పాయింట్స్:
కథ, దర్శకత్వం, నటీనటుల నటన ముఖ్యంగా కొత్తవాడైనా రాగిన్ రాజ్ నటన, సాంగ్స్, డిఓపి, ఎడిటింగ్ వర్క్.
మైనస్ పాయింట్స్:
బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాల్లో డల్ గా ఉండటం, వైలెన్స్ కొంచెం ఎక్కువగా ఉండటం.
సారాంశం:
అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన సినిమాకి విజయం తప్ప అపజయం అనేది ఉండదు.
రేటింగ్: 3/5
సినిమా : తల
నటీనటులు: అమ్మ రాగిన్ రాజ్, అంకిత నస్కర్, రోహిత్, ఎస్తేర్ నోరోన్హ, ముక్కు అవినాశ్, సత్యం రాజేశ్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, శ్రవణ్
దర్శకుడు: అమ్మ రాజశేఖర్
నిర్మాత : శ్రీనివాస గౌడ్
బ్యానర్: దీపా ఆర్ట్స్
రైటర్స్: అమ్మ రాజశేఖర్
డీఓపీ: శ్యామ్ కె నాయుడు
సాంగ్: థమన్ ఎస్ఎస్
మ్యూజిక్ డైరెక్టర్: ధర్మ తేజ, అస్లాం కేఈ
బీజీఎం: అస్లాం కేఈ
డైలాగ్స్: అమ్మ రాజశేఖర్ అండ్ టీం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాధ రాజశేఖర్
ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ
డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్: అమ్మ రాజశేఖర్
లిరిసిస్ట్స్: ధర్మతేజ
ఎడిటర్ : శివ సామి
పీఆర్వో: మధు వీఆర్
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం